నా శిష్యుడి చిత్రం మొదటి బ్లాక్ బస్టర్: వెట్రిమారన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తమిళనాడు

సూరి హీరోగా నటించిన 'మందాడి' చిత్రంపై ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ప్రశంసలు కురిపించారు. తన సహాయక దర్శకులలో ఒకరైన మతిమారన్ పుగజేంది తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సముద్రం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, నటీనటుల అంకితభావం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని వెట్రిమారన్ కొనియాడారు.