భారీ వర్షాల ఎఫెక్ట్: పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది సెలవులు రద్దు చేసిన పవన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తుపాను నేపథ్యంలో అమరావతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తాగునీరు మరియు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.