ఏసీబీ ఉచ్చు: ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ క్లర్క్
రిపోర్టర్: విజయ్
స్థలం: Mumbai
అరెస్ట్ వివరాలను యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబై నైగావ్ లా శాఖలో సీనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న బద్రీనాథ్ శివహరి తొర్వే ఉద్యోగి నుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని ఏసీబీ అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జీతం బిల్లును ప్రాసెస్ చేయడానికి ముప్ఫై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని అధికారులు స్పష్టం చేశారు.