రుచికరమైన వంటకాలతో పట్టణంలో ప్రారంభమైన హోటల్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం పట్టణంలోని ఆదిత్య థియేటర్ పక్కన రేలంగి వారి అరిటాకు భోజనం హోటల్ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేలంగి వారి వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని, టిఫిన్, భోజనం నాణ్యతతో అందిస్తారని తెలిపారు. గతంలో పలుమార్లు వారి చేతి వంటలు రుచి చూశానని, మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, హోటల్ యజమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు.