అమెరికాకు భారీ షాక్: చైనాతో కెనడా ఆర్థిక సంబంధాలు బలోపేతం

రిపోర్టర్: సునీల్ స్థలం: Ottawa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానంతో వాషింగ్టన్, ఒట్టావా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను వేగంగా పటిష్టం చేసుకుంటున్నారని విశ్లేషకులు తెలిపారు. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో బీజింగ్ లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వాణిజ్యం, ఇంధనం, వ్యవసాయ రంగాల్ లో కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించినట్లు ఆయన స్పష్టం చేశారు.