'నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత': వివేకా హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు చుక్కెదురైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు నిందితుల డిశ్చార్జ్‌ పిటిషన్లను తిరస్కరించింది. ఈ కేసులో ఏ1 గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ6 ఉదయ్‌ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ న్యాయస్థానం వాటిని కొట్టివేసింది.