కోటిపల్లి-నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు వంద కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: సతీష్
స్థలం: కోనసీమ
కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసిందని అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ (బాలయోగి) వెల్లడించారు. దివంగత నేత జి.ఎం.సి. బాలయోగి 75వ జయంతి సందర్భంగా కోనసీమ ప్రజలకు ఈ నిధులు భారీ కానుక అని పేర్కొన్నారు. భూసేకరణకు నిధులు మంజూరు కావడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.