జైలర్ 2 సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులలో తీవ్ర నిరాశ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం జైలర్ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్లు లేకపోవడంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో తెలుగు నటులకు కీలక పాత్రలు దక్కకపోవడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వంటి పరిణామాలు అభిమానులను నిరాశకు గురిచేశాయని సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు.