ఈసీ కూటమితో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న రాహుల్ గాంధ
రిపోర్టర్: వెంకట్
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఈసీ కలిసి పార్టీలను చీల్చుతూ ఎన్నికల గుర్తులను లాక్కుంటున్నాయని మండిపడ్డారు. మొదట శివసేన, ఎన్సీపీలను టార్గెట్ చేసిన ఈ శక్తులు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతీస్తున్నాయని దుయ్యబట్టారు. పార్టీలను, ఓట్లను చోరీ చేస్తున్న ఈ చర్యలు ప్రజాస్వామ్య పతనానికి నిదర్శనమని ఆరోపించారు.