అమనగల్లు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్యంతో ఊరట

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

అమనగల్లు మున్సిపల్ సిబ్బంది మరియు వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శిబిరాన్ని ప్రారంభించి సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని కొనియాడారు. ఈ శిబిరంలో పలువురు నిపుణైన వైద్యులు పాల్గొని వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించారు.