ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైన కమల సైన్యం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై నూతన నాయకులకు నియామక పత్రాలను అందజేశారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ మోర్చాల బాధ్యులను నియమించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని ఈ సందర్భంగా శ్రీదేవి పిలుపునిచ్చారు.