'ఎగుమతులకు లైన్ క్లియర్': మంగంపేట ముగ్గురాయిపై కేంద్రం కీలక నిర్ణయం
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన వైఎస్సార్ జిల్లా మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్ల ముగ్గురాయి ఎగుమతులకు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు దిల్లీలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ నిర్వహించిన ఉన్నత స్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొని కోటి టన్నుల నిల్వల్లో 70 లక్షల టన్నుల ఎగుమతికి అనుమతులు సాధించారు.