పోకలపాలెం–గోధుమలంక బీటీ రోడ్డు ప్రారంభం: గిరిజనులకు సులభతరమైన రవాణా వసతి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బుదరాళ్ల పంచాయతీ పరిధిలోని పోకలపాలెం నుంచి గోధుమలంక వరకు మూడున్నర కిలోమీటర్ల మేర నిర్మించిన బీటీ రోడ్డును బీజేపీ మహిళా నాయకురాలు లోకుల అచ్యుత వాణి ప్రారంభించారు. మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలతో ఈ రహదారిని పూర్తి చేశారు. ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో స్థానిక గిరిజన గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.