జామియా మిలియా ఇస్లామియాలో ఉద్రిక్తత: లైబ్రరీలు మూసివేతపై విద్యార్థుల ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

విద్యార్థి సంఘం పునరుద్ధరణను డిమాండ్ చేస్తూ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సెక్యూరిటీ కారణాలరీత్యా లైబ్రరీలను మూసివేసినట్లు విశ్వవిద్యాలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని, విద్యార్థుల గొంతును అణచివేసే చర్య అని ఐసా కార్యదర్శి సౌరభ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆందోళనకారులపై వర్సిటీ తీసుకున్న చర్యలు క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయని, పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను బలవంతంగా తరలించారని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.