అసెంబ్లీలో హరీష్ రావు, స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య వాగ్వాదం

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై సభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరును హరీష్ రావు తప్పుపట్టగా, ఇది గౌరవసభ కాదని కౌరవసభలా మారిందని మండిపడ్డారు. అయితే స్పీకర్ తల్లిని దూషించారని, అవమానం జరిగింది నీ తల్లికి కాదని, నా తల్లికి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆవేశంతో ఘాటుగా బదులిచ్చారు.