నెల్లూరు జిల్లా పరిషత్తు చైర్మన్ పదవి జనరల్కు కేటాయింపు: ఉత్తర్వులు జారీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా పరిషత్తు చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయిస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయని అధికారులు తెలిపారు. 2021లో ఈ స్థానం జనరల్ మహిళకు కేటాయించగా, తాజాగా ఖరారైన రిజర్వేషన్లతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జిల్లాలోని ముప్పై ఐదు మండలాల్లో ఎస్టీలకు నాలుగు, ఎస్సీలకు ఎనిమిది, బీసీలకు ఐదు, జనరల్ మహిళలకు తొమ్మిది, జనరల్ స్థానాలు తొమ్మిది చొప్పున జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.