యువ పేసర్ అన్షుల్ కంబోజ్ పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Auckland
భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ 2027 వన్డే ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యే సత్తా కలిగి ఉన్నాడని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో అన్షుల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని ఆయన తెలిపారు. సీమ్ కండిషన్లను సరిగ్గా ఉపయోగించుకున్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కేవలం ఇరవై రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడని పఠాన్ వివరించారు.