గొర్రెల కాపరిగా మారిన చిన్నారి రామయ్య దీనస్థితిపై స్పందించిన మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: రమేష్ స్థలం: ప్రకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో బడికి వెళ్లాల్సిన వయసులో గొర్రెలు కాస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు రామయ్య కష్టాలపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో స్పందన తెప్పించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆ దృశ్యాలపై తక్షణమే స్పందించిన ఆయన, స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాలుడిని రక్షించామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి ఉన్నత చదువులు చెప్పిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.