యష్ 'టాక్సిక్' సినిమా ఓటీటీ ఆఫర్ భారీగా పతనం!

రిపోర్టర్: రాము స్థలం: కర్ణాటక

కన్నడ స్టార్ యష్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఓటీటీ బిజినెస్ పై తీవ్ర ప్రభావం పడింది. విడుదలకు ముందు రూ. 150 కోట్లు పలికిన డిజిటల్ రైట్స్ ధర, సినిమా ఫలితం తర్వాత కేవలం రూ. 30 కోట్లకు పడిపోయినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.