నూటొక్క దేశాలకు గ్లోబల్ తెలంగాణ సంఘం విస్తరణ లక్ష్యం
రిపోర్టర్: నరేష్
స్థలం: టెక్సాస్
టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో జరిగిన గ్లోబల్ తెలంగాణ సంఘం బోర్డు సమావేశంలో సంస్థ విభాగాలను నూటొక్క దేశాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వ్యవస్థాపక ఛైర్మన్ కలవాల విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. 2023లో స్థాపించిన ఈ సంఘానికి ప్రస్తుతం యాభై నాలుగు దేశాల్లో శాఖలు ఉన్నాయని, జన్మభూమికి కర్మభూమికి మధ్య వారధిగా సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.