దారుణం: కరెంట్ షాక్ తో భర్త మృతి చెందితే భార్యపై అత్త నిందలు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

భర్త కరెంట్ షాక్ తో మరణిస్తే కర్వా చౌత్ వ్రతం భంగం చేసిందంటూ భార్యను అత్త నిందించినట్లు డాక్టర్ ఆకాంక్షా సింగ్ వెల్లడించారు. ఆసుపత్రి అత్యవసర విభాగంలో విధుల్ లో ఉన్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణంతో గుండెలు పగిలేలా రోదిస్తున్న ఆ మహిళపై కుటుంబ సభ్యులు అమానుషంగా నిందలు మోపారని, మూఢనమ్మకాల వల్ల సమాజంలో ఇప్పటికీ మహిళలను బాధ్యులను చేసే దుస్థితి కొనసాగుతోందని ఆమె తీవ్రంగా ఖండించారు.