ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాద కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. నిందితులను తక్షణమే అరెస్టు చేయవద్దని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులను ఆదేశించింది. కేవలం సెక్షన్ల ఆధారంగా కాకుండా నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేయాలని తేల్చిచెప్పింది. చట్టాన్ని అతిక్రమిస్తే సహించేది లేదని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.