కలువాయిలో విషాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడి యువకుడు మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కలువాయి
కలువాయి మండలంలోని తోపుగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చందు అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు నుంచి ఏసీ మెకానిక్ సామాగ్రితో కలువాయికి వస్తున్న క్రమంలో ఆయన ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.