ఉద్యోగి ఒరిజినల్ పాన్ కార్డును నిలిపివేసిన కంపెనీ: రెడ్ డిట్లో తీవ్ర దుమారం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బెంగళూరు

వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కారణంగా ఉద్యోగం మానేసిన మాజీ ఉద్యోగి ఒరిజినల్ పాన్ కార్డును ఇవ్వడానికి బెంగళూరుకు చెందిన కోరిజో ఎడ్టెక్ కంపెనీ నిరాకరించిందని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. నోటీసు పీరియడ్ పూర్తి చేయలేదనే సాకుతో ముఖ్యమైన గుర్తింపు పత్రాన్ని హెచ్ఆర్ బృందం హోల్డ్ చేయడం చట్టవిరుద్ధమని, తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసినట్లు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.