మిషన్ శక్తి పరీక్ష: భారత్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిందన్న అమెరికా అధికారి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

భారత్ చేపట్టిన మిషన్ శక్తి పరీక్షతో అమెరికా నిఘా వర్గాలు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొన్నాయని అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్ గ్రుష్ వెల్లడించారు. మార్చి 2019లో భారత్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగించిందని, ఆ సమయంలో అమెరికా మిలిటరీ ఆపరేషన్ సెంటర్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆయన ఓ పాడ్కాస్ట్లో సంచలన విషయాలు బయటపెట్టారు.