నత్తనడకన కావలి రహదారి విస్తరణ పనులతో ప్రజల అవస్థలు

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

కావలి పట్టణంలో ట్రంకురోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు తెలిపారు. రెండు నెలల క్రితం కంకర పరిచినా ఇంతవరకు తారు పనులు చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. గతంలో నిధులు నిలిచిపోగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తాగునీటి పైపులైన్ల పనుల వల్ల ఆలస్యం జరుగుతోందని, పనులు త్వరగా పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.