ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం: అభయ మై ట్యాక్సీ యాప్ ప్రారంభం

రిపోర్టర్: అశోక్ స్థలం: హన్మకొండ

ప్రయాణికుల భద్రత అత్యంత కీలకమని, ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆటో మరియు క్యాబ్ వాహనాల కోసం అభయ మై ట్యాక్సీ సేఫ్ యాప్ తో పాటు ప్రత్యేక స్టిక్కర్లను ప్రారంభించారు. పాఠశాల మానేసిన విద్యార్థులను తిరిగి బడిబాట పట్టించేందుకు మరియు యువతను డ్రగ్స్, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంచే లక్ష్యంతో ప్రత్యేక విద్యా ప్రేరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.