మంగళూరు రిఫైనరీలో హైప్రెషర్ సెపరేటర్ పేలి కార్మికుడు దుర్మరణం

రిపోర్టర్: సతీష్ స్థలం: మంగళూరు

మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ రిఫైనరీలో హైప్రెషర్ సెపరేటర్ పగిలిపోవడంతో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం చెందారని ఎంపీఆర్ఎల్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ రుడాల్ఫ్ విజె నోరోన్హా వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా పదకొండు మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఉదయం సుమారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కోకర్ హైడ్రో ట్రీటింగ్ యూనిట్లో జరిగిన ఈ పేలుడు తీవ్ర కలకలం రేపింది.