ముత్తుకూరు మండలంలో కనుమరుగైన ఉప్పు పరిశ్రమ: నిరుపయోగంగా కొటార్లు

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

ముత్తుకూరు మండలంలో నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గోపాలపురం, చలివేంద్రం, బలిజపాళెం ప్రాంతాల్లో వంద ఎకరాలకుపైగా భూముల్లో ఉప్పు సాగు సాగేది. ఇక్కడ తయారైన ఉప్పును దేశంలోని అనేక నగరాలకు ఎగుమతి చేసేవారు. ప్యాకింగ్, రవాణా రంగాలపై ఆధారపడి వందలాది మంది కార్మికులు ఉపాధి పొందేవారు. పరిశ్రమలా వృద్ధి చెందడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉప్పు సొసైటీని కూడా ఏర్పాటు చేసింది.