అమెరికాలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్ బాలసుబ్రమణ్యం కన్నుమూత

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

అమెరికాలో క్లోమ క్యాన్సర్తో చికిత్స పొందుతూ ఆంధ్రప్రదేశ్ కేడర్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్ బాలసుబ్రమణ్యం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు విభజిత ఏపీలో వివిధ హోదాల్లో ఆయన సుదీర్ఘ సేవలు అందించారని పేర్కొన్నారు. డీజీ హోదాలో ఈ ఏడాది ఆగస్టులో పదవీవిరమణ చేసిన ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.