టీమ్ ఇండియా భారీ స్కోర్: న్యూజిలాండ్ ముందు 192 పరుగుల లక్ష్యం
రిపోర్టర్: రాము
స్థలం: హామిల్టన్
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ లో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ప్రారంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వికెట్లను కోల్పోయి కష్టాల్ లో పడింది. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న ఇషాన్ కిషన్ 61 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారని బీసీసీఐ వెల్లడించింది.