వైరల్ వీడియో: భారతీయ గ్రామీణ జీవన శైలిని ఆస్వాదించిన జర్మన్ డిప్లొమాట్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
భారతీయ గ్రామీణ జీవన శైలిని అనుభవించేందుకు జర్మన్ రాయబార కార్యాలయానికి చెందిన రాజకీయ వ్యవహారాల అధికారి మారియస్ ఓస్వాల్డ్ ఒక గ్రామాన్ని సందర్శించారని జర్మనీ రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రమోద్ శర్మ అనే రైతు వద్దకు వెళ్లి పశువులకు దాణా పెట్టడం, చేతితో గడ్డి కోసే యంత్రం నడపడంతో పాటు స్వయంగా ఆవు పేడను ఎత్తడం వంటి గ్రామీణ పనులను ఆయన ఎంతో ఉత్సాహంగా చేశారని, ఈ వీడియో నెట్టింట వైరల్ అయిందని అధికారులు తెలిపారు.