భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ చిత్రం
రిపోర్టర్: అశోక్
స్థలం: India
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' సెప్టెంబర్ 18న విడుదల కానుంది. దివంగత మదన్ కథతో రూపొందిన ఈ సైకలాజికల్ మిస్టరీ మ్యూజికల్ మూవీ, సౌండ్ థెరపీ మరియు మెదడుకు ఉన్న సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌గా ఈ చిత్రం నిలవడం విశేషం.