ముంచింగిపుట్టు బాధిపుట్టు పాఠశాల పేరెంట్స్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: ముంచింగిపుట్టు
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ పరిధిలోని బాధిపుట్టు ఎంపీపీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. చైర్మన్గా వంతల మోహన్, వైస్ చైర్మన్గా పాంగి మణికుమారి ఎన్నికయ్యారు. నూతన కమిటీని మాజీ చైర్మన్ ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులతో కలిసి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.