లేబర్ కోడ్లపై అవగాహన కోసం క్విజ్ పోటీ నిర్వహిస్తున్న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh / Telangana

లేబర్ కోడ్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా క్విజ్ పోటీని నిర్వహిస్తున్నట్లు Ministry of Labour & Employment, GoI వెల్లడించింది. కార్మిక సంక్షేమ చట్టాలు, నూతన లేబర్ కోడ్ల అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఈ క్విజ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల ఉద్యోగులు, కార్మికులు, పౌరులు సరైన సమాధానాలను కామెంట్స్ రూపంలో షేర్ చేయాలని కోరారు. కార్మికుల హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించడమే ఈ క్విజ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.