సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కమలనాథులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుస్నాబాద్ మండలశాఖ అధ్యక్షుడు బుక్యా సంపత్ నాయక్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను నేటి తరానికి తెలియజేయడంతోపాటు, వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.