చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు: నిజం గెలిచిందన్న మంత్రి లోకేష్
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు గురై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే గొడ్డలి పార్టీ అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. చంద్రబాబు జైలులో ఉన్న 53 రోజులు తెలుగు ప్రజలు అండగా నిలిచారని, చివరకు న్యాయమే గెలిచి ఆయన స్వేచ్ఛగా బయటకు వచ్చారని లోకేష్ గుర్తుచేసుకున్నారు.