టీచర్లపై వైసీపీ గూండాగిరీని తీవ్రంగా ఖండించిన కూటమి నేతలు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
టీచర్ ఉద్యోగాల భర్తీతో కూటమి ప్రభుత్వం గురువులను గౌరవిస్తుంటే.. వైఎస్సార్సీపీ మాత్రం టీచర్లపై గూండాగిరీకి పాల్పడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రెడ్డి సంస్కారం ఇదేనా అని, ఉపాధ్యాయులపై ఎందుకంత కక్ష అని నేతలు నిలదీస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.