విశాఖలో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో నగర సీపీ ఆకస్మిక తనిఖీ
రిపోర్టర్: రాము
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో భద్రతా చర్యలను ముమ్మరం చేసే భాగంగా స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ను కమీషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా స్టేషన్లోని ఫైళ్లు, రికార్డులను నిశితంగా పరిశీలించి రిజిస్టర్ల అప్డేట్ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు విశాఖపట్నం సిటీ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.