నెల్లూరులో కలకలం: వేర్వేరు ఘటనల్లో ఇద్దరి దారుణ హత్య
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలో ఒక్కరోజే రెండు హత్యలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. సెల్ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో విజయ్కుమార్ను పలువురు కర్రలతో కొట్టి చంపగా, మరో ఘటనలో మద్యం మత్తులో జరిగిన గొడవలో వెంకటాద్రి కత్తితో దాడి చేయడంతో రంగయ్య అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు వేర్వేరు హత్యలపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.