పోలీసుల కస్టడీ నుంచి పరారైన ఏఎస్ఐ కాల్పుల నిందితుడు
రిపోర్టర్: హరి
స్థలం: అమృత్సర్
అమృత్సర్లో ఏఎస్ఐ జస్వంత్ సింగ్ పై కాల్పుల ఘటనలో అరెస్టయిన నిందితుడు కరణ్ పోలీసుల కస్టడీ నుంచి పరారయ్యాడు. ఆయుధం స్వాధీనం చేసుకునేందుకు మజితా ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. భద్రతా వైఫల్యంపై సీరియస్ అయిన అమృత్సర్ రూరల్ ఎస్ఎస్పీ కన్వల్ప్రీత్ సింగ్ చాహల్ రాజసన్సి ఎస్హెచ్ఓ గురుప్రీత్ సింగ్ను సస్పెండ్ చేశారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.