మాస శివరాత్రి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద ఘనంగా అన్నదానం

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద బుధవారం మాస శివరాత్రి సందర్భంగా భక్తులకు ఘనంగా అన్నదానం నిర్వహించినట్లు ఆలయ ఈఓ వెంకటరమణ తెలిపారు. ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రికి ఇలా భోజనాలు పెట్టడం ఆనవాయితిగా వస్తోందని ఆలయ చైర్మన్ కేవీ రమణ, మాజీ చైర్మన్ శంకర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.