మహిళా జర్నలిస్టులకు నీతులు చెబుతున్నారంటూ ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

మహిళా జర్నలిస్టులకు ఢిల్లీ పోలీసులు నీతులు చెబుతున్నారంటూ స్వతంత్ర గ్రౌండ్ జర్నలిస్ట్ మరియు ఫ్యాక్ట్ చెకర్ తులసి చందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు జరిగితే బాధితులకే జాగ్రత్తలు చెప్పడం సరికాదని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ పోలీసుల వ్యవస్థ తీరును తప్పుపడుతూ ఆమె సామాజిక మాధ్యమ వేదికగా విమర్శలు గుప్పించారు. పోలీస్ వ్యవస్థే అబ్యూసర్గా మారితే ఎలా అని ఆమె సూటిగా ప్రశ్నించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.