ఉద్యోగులకు దసరా కానుకగా డీఏలు చెల్లించనున్న తెలంగాణ సర్కార్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు డీఏలను కలిపి మొత్తం 6.4 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రాబోయే అక్టోబర్ 1న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. దసరా పండుగ కానుకగా ఈ నిర్ణయం అమలు కానుండగా, కొత్త పీఆర్సీ నివేదిక తెప్పించుకోవడంతో పాటు మార్చి నాటికి పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.