మేడిగడ్డ తాండలో ఓటర్ల నమోదు ప్రక్రియ పరిశీలన
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తాండ గ్రామపంచాయతీలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను ఎంపీడీఓ జైరాం విజయ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్ల నమోదు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త పేర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఎంపీడీఓ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్, ఉపసర్పంచ్ విజయ్ రాథోడ్, జీపీఓ మనిల, బిఎల్ఓలు సరోజ, సరిత పాల్గొన్నారు.