డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ భార్య సుమలత తొలగింపు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత వివాదాల నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత నాయకత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ భేటీలో నిర్వహించిన బలపరీక్షలో సుమలత వైపు 11 మంది మాత్రమే నిలవగా, రఘు మాస్టర్‌ వైపు ఏకంగా 214 మందికి పైగా భారీ మద్దతు తెలిపారు. మెజారిటీ సభ్యుల మద్దతు రఘు మాస్టర్‌కు ఉండటంతో, ఫెడరేషన్ పెద్దలు అక్టోబర్ 11వ తేదీన నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.