కోడి పందేల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామ శివారులో కోడి పందేల స్థావరంపై టాస్క్ఫోర్స్ మరియు కన్నెపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రెండు వేల నూట రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. కోడి పందేలు మరియు జూదాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.