తీవ్ర అలర్ట్: ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగుపాటు ముప్పు ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో నిలబడటం సురక్షితం కాదని అధికారులు స్పష్టం చేశారు.