మారుతి కార్లకు పోటీగా టాటా ఏరిస్ ఆటోమేటిక్ సీఎన్జీ మోడల్
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh / Telangana
టాటా ఏరిస్ కారు కేవలం వ్యక్తిగత కొనుగోలుదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఫ్లీట్ కస్టమర్లకు ఈ అవకాశం లేదని కార్ల రివ్యూయర్ మరియు ఆటో ఎడిటర్ సిద్ధార్థ్ వినాయక్ పటంకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ట్యాక్సీ మార్కెట్ అవసరాల కోసం టిగోర్ ఎక్స్‌ప్రెస్-టి కారు సేవలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే మారుతి ఏఎంటీ సీఎన్జీ కార్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఏరిస్ కారులో చక్కని డిజైన్‌తో కూడిన సీఎన్జీ వేరియంట్‌ను, ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.