నాగావళి నది వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి అచ్చం నాయుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుజరాతిపేట ప్రాంతంలో మంత్రి కింజరాపు అచ్చం నాయుడు నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిలతో కలిసి ఆయన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉధృతిపై అధికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.